రైల్వే నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రైల్వే నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని పట్టణంలోని మేదర రైల్వే ట్రాక్ భూగర్భ రైల్వే వంతెన పనులను నేడు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రైల్వే శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల ప్రజల విజ్ఞప్తి మేరకు భూగర్భరైల్వే నిర్మాణ పనులను చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తి అయితే ప్రయాణ భారం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ కృష్ణ, తహసీల్దార్ శివరాముడు ఉన్నారు.