ముంపు గ్రామాల ప్రజలకు ముఖ్య గమనిక
PLD: పులిచింత ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం దిగువున పులిచింతల ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అచ్చంపేట మండల సీఐ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. మత్స్యకారులు, ప్రజలు ఎవరూ కృష్ణానది వెంబడికి వెళ్లవద్దని సూచించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.