ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని దిరశవంచ పంచాయతీలో చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టీడీపీ మండల నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసుల రెడ్డి, పోల్ రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు.