అభ్యర్థుల పేర్లు ప్రకటన, గుర్తుల కేటాయింపు
MNCL: జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులు అధికారులు ప్రకటించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. ఈ మండలంలోని కొత్తపేట, కవ్వాల్, పోన్కల్ అన్ని గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల వివరాలు, వారికి కేటాయించిన గుర్తులను వెల్లడించారు.