సీఎస్ఐ చర్చ్‌లో భక్తుల సందడి

MDK: ఆసియా ఖండంలో ప్రఖ్యాతి గాంచిన మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ప్రెస్ బీటర్ ఇంఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు ముందుగా ఆలయ ముందు భాగంలో ఉన్న సిలువ వద్ద కొబ్బరి కాయలు కొట్టి, కొవ్వొత్తులు వెలిగించి తమ మొక్కులను చెక్కించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసినారు.