బాలికకు రూ.2.50 లక్షల చెక్కు పంపిణీ

KDP: మైదుకూరు మండలం జాండ్లవరం VRO కాలనీకి చెందిన సంబటూరు తేజ వర్దినికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.2.50 లక్షల చెక్కును ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం అందజేశారు. కరుణాకర్ కుమార్తె అయిన తేజ వెన్నెముక సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వైద్యం కోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించారు. పేద ప్రజలకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.