LHMS సిస్టంతో మీ ఇల్లు భద్రం: సీఐ
NLR: వేసవి కాలంలో ప్రజలు ఊర్లకు వెళ్ళే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఐదు రోజుల పాటు ఊళ్ళకి వెళ్తే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే LHMS సిస్టమును ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో 24 గంటలు ఇల్లు పోలీస్ కంట్రోల్‌లో ఉంటుందన్నారు. ఉచితంగా అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.