రైలు కింద పడి 18 గొర్రెలు మృతి

రైలు కింద పడి 18 గొర్రెలు మృతి

NRPT: మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో 18 గొర్రెలు మృతి చెందాయి. రైలు పట్టాల పక్కన మేత మేస్తున్న గొర్రెలు అకస్మాత్తుగా పట్టాలపైకి వెళ్లాయి. ఈ సమయంలో రాయచూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు వాటిని ఢీకొట్టింది. నష్టపోయిన గొర్రెల యజమాని కుర్వ వెంకటప్పను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.