నెల్లూరు నగరపాలక సంస్థలో భారీగా పన్ను వసూళ్లు

నెల్లూరు నగరపాలక సంస్థలో భారీగా పన్ను వసూళ్లు

నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రాపర్టీ టాక్స్ రూ.4.67 కోట్లు వసూలైంది. నగరపాలక సంస్థ అధికారులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆస్తి పన్ను వసూళ్లు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి 50 శాతం వడ్డీ రాయితీ ఇచ్చి ఉండడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఒక్క ఖాళీ స్థలం పన్నుకు సంబంధించి రూ. 66.85 లక్షలు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.