సెలక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పురుషుల, మహిళల క్రికెట్, అండర్-19 జట్ల సెలక్షన్ కమిటీలకు సంబంధించి సెలక్టర్ల పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. జాతీయ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీలో రెండు, మహిళా క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో నాలుగు పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ మెన్ సెలక్షన్ కమిటీలో ఒక సెలక్టర్ పదవిని భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.