VIDEO: మద్యం మత్తులో గొడవ.. యువకుడిపై దాడి
HNK: గోపాల్పూర్‌లో యువకుడిపై కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది. ఆదివారం పుల్లలు చెరువు వద్ద మద్యం సేవించిన ఇద్దరు మిత్రులు రామ్ చరణ్, కార్తీక్ మధ్య డబ్బుల విషయంపై గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తన మిత్రుడు కార్తీక్‌పై కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది