తెల్లబల్లి సహకార సంఘం సీఈఓ విచారణ ప్రారంభం
SRPT: తెల్లబల్లి సహకార సంఘం సీఈఓ ఆత్మహత్యాయత్నం ఘటనపై శనివారం అధికారులు విచారణ చేపట్టారు. గతంలో జరిగిన రికార్డుల తారుమారు, డైరెక్టర్ల సంతకాల ఫోర్జరీ, అక్రమ నియామకాలపై మునగాల బ్యాంకు మేనేజర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ప్రస్తుతం సీఈఓ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అక్రమాలపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరుతున్నారు.