బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

MHBD: నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మృతుడి ఇంటికి వెళ్లి, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు.