సైబర్ నేరాల పై అవగాహన

సైబర్ నేరాల పై అవగాహన

కృష్ణా: మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఎస్పీ ఆర్.గంగాధరరావు విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. డిజిటల్ నేరాలు, రహదారి భద్రత, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, న్యాయ సంహితల మార్పులు తదితర అంశాలపై విపులంగా ఎస్పీ వివరించారు. విద్యార్థులలో చైతన్యం కల్పించే విషయాలు మాట్లాడారు.