'వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే చేయాలి'
BHNG: వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించి అన్ని మందులు ఉన్యాయో లేదో పరిశీలించారు. అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.