విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌

VSP: పీఎంపాలెం న్యాయ కళాశాల వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురవాడ పోర్ట్ కాలనీకి చెందిన దొడ్డి తులసీరామ్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.