'ఆ రోజు పెళ్లి చేసుకునే వారికి రూ.80వేలు'

KRNL: మే 16న పెళ్లి చేసుకునే దంపతులకు పారితోషికం ఇవ్వనున్నట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రకటించారు. ఆ రోజు తన జన్మదినం కావడంతో నూతన వధూవరులకు రూ.80వేల నగదు, పట్టు వస్త్రాలు, బంగారు తాలిబొట్టు ఇస్తానని తెలిపారు. తన బర్త్ డే సందర్భంగా 30ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.