వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన సర్పంచ్

వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన సర్పంచ్

హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో బాలవికాస వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ బిర్లా యాదగిరి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. బాల వికాస అనే స్వచ్ఛంద సంస్థ గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ వాటర్ ప్లాంట్‌ను సందర్శించి పంతీరు వాటర్ పంపిణీ విధానంపై సిబ్బందితో చర్చించారు.