'ఈనెల 16న సామూహిక వివాహాలు'
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈనెల 16న ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్ అప్ప శివ తెలిపారు. పెళ్లి చేసుకునే జంటలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వారికి వారి సంప్రదాయ పద్ధతి ప్రకారమే వివాహం జరిపిస్తామన్నారు. పెళ్లి కోసం బంగారుపుస్తె, మెట్టెలు, డబుల్ కాట్ బెడ్, ఇతర వస్తువులను ఉచితంగా అందజేస్తామన్నారు.