నాగరంలో ఆసక్తిగా మారిన సర్పంచ్ ఎన్నిక

నాగరంలో ఆసక్తిగా మారిన సర్పంచ్ ఎన్నిక

SRPT: నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డిపై చార్టెడ్ అకౌంటెంట్ చిప్పలపల్లి మధు పోటీ చేస్తున్నారు. తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి చేస్తానని మధు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.