ఘనంగా హిందూ మహా సమ్మేళనం
కామారెడ్డిలోని కల్కినగర్ బస్తీలో ఆదివారం రాత్రి హిందూ మహా సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. సమ్మేళనంలో కాలనీకి చెందిన పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. వక్తలుగా హాజరైన జ్ఞాన చైతన్యానంద స్వామీజీ, వేంపల్లి ప్రతాప్, జ్యోతిలు మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని వివరించారు.