VIDEO: కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

VIDEO: కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ.. ఈనెల 20న జరిగే కార్మిక కర్షక జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల హక్కులను హరించే మొండి వైఖరిని మోదీ ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలన్నారు.