VIDEO: దూబచర్లలో 2 వేల మందితో భారీ ర్యాలీ
E.G: నల్లజర్ల మండలం దూబచర్లలో మంగళవారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేయవద్దని, ప్రాణాలు కోల్పోవద్దని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బ్రహ్మరాజు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.