'పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి'
MBNR: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సిఎస్ ఛైర్మన్ నటరాజ్, వైద్యులు శామ్యూల్ పాల్గొన్నారు.