జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ తేజస్

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ తేజస్

SRPT: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. లక్ష్మీ శారదను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు భవనంలో కలెక్టర్ జడ్జికి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పాలన, అభివృద్ధిలో న్యాయ విభాగం అందిస్తున్న సహకారం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.