పరీక్ష కేంద్రాల తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పరీక్ష కేంద్రాల తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కరీంనగర్‌లోని పారామిత హై స్కూల్ సిద్ధార్థ హై స్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాస్తున్న పరీక్ష తీరును పరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఎలా సాగుతున్నది, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు.