'విద్యార్థులను వేధింపులకు గురి చేయొద్దు'

'విద్యార్థులను వేధింపులకు గురి చేయొద్దు'

ADB: వార్షిక పరీక్షల నేపథ్యంలో ఫీజులు చెల్లించాలని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వేధింపులకు గురి చేయడం సరైంది కాదని AIYF జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ అన్నారు. ఈ విషయమై పట్టణంలో గురువారం ఆయన మాట్లాడారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు దూరం చేయడం సరైనది కాదన్నారు. విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు.