భూ సేకరణకు రైతులు సహకరించాలి: తహసీల్దార్

భూ సేకరణకు రైతులు సహకరించాలి: తహసీల్దార్

WGL: రాయపర్తి మండలం కొలన్‌పల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో దేవాదుల కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని రాయపర్తి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ కోరారు. భూ సేకరణ కోసం నాయబ్ తహసీల్దార్ త్రినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. కాలువ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని అధికారులు తెలిపారు.