గ్రామంలో సమస్యలు ఉంటే చెప్పండి: ఎమ్మెల్యే

VZM: రాజాం నియోజకవర్గ ప్రజలు తమ గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, డైనేజీ వంటి సమస్యలను తెలియజేయాలని స్దానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సూచించారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 995109888 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, అందిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.