భూత్పూర్‌లో అక్రమంగా గుట్ట త్రవ్వకాలు
MBNR: భూత్పూర్ మండల కేంద్రంలో అక్రమంగా గుట్ట త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. మండలంలోని కోతలమడుగు శివారులో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు సంబంధించి మొరం అవసరం కావడంతో గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తవ్వుతున్నారు. టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మొరం తరలిస్తున్నా రెవెన్యూ మైనింగ్ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.