రెండవ రోజు చేరిన నిరాహార దీక్ష
NGKL: చారకొండ మండలం గోకారం-ఎర్రవల్లి రిజర్వాయర్ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లి, తండా గ్రామస్థుల రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తే తమకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అధికారులు స్పందించి సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు.