మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అశోక్ నియమకం
CTR: మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పుంగనూరుకు చెందిన అశోక్ నియమితులయ్యారు. మదనపల్లెలో జరిగిన మాల మహానాడు రాష్ట్ర మహాసభల్లో అశోక్‌ను ఉపాధ్యక్షుడిగా చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తనపై ఉన్న నమ్మకంతో ఇంతటి పదవిని అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా తనవంతు కృషి చేస్తానని అశోక్ వెల్లడించారు.