జగన్‌ని కలిసిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

జగన్‌ని కలిసిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

VZM: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కలిశారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ వారికి దిశానిర్దేశం చేశారు.