అనకాపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 320 అర్జీలు: జేసీ

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు 320 అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ.. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు.