బస్సు షెల్టర్ కూల్చివేతపై కేసు నమోదు

TPT: చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ ప్రవేశ మార్గంలో రెండు రోజుల క్రితం పలువురు బస్సు షెల్టర్‌ను కూల్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఆర్అండ్ బీ ఈఈ అజిత్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తొండవాడ పంచాయతీ మాజీ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి, మండపంపల్లిలోని పలువురిపై కేసులు నమోదు అయ్యాయి.