మహిళ అదృశ్యంపై కేసు నమోదు
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని మహిళ అనరాశి పోషవ్వ అదృశ్యంపై కేసు నమోదు చేశామని ఎస్సై రాహుల్ రెడ్డి శనివారం రాత్రి తెలిపారు. ఈనెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదని చెప్పారు.