భూలోక మాత ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలి : నగర మేయర్

VSP: గ్రామ దేవత భూలోక మాత ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు. మేయర్ దంపతులు కొత్త వెంకోజీపాలెం వద్ద కొలువై ఉన్న భూలోక మాత అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పసుపు కుంకాలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, నగరాభివృద్ధి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.