VIDEO: 'అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలి'

WNP: జిల్లాలో అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసు వెనుక ఉన్న కారణాలు, చోటు చేసుకునే ప్రాంతాలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాలపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. డెలివరీ రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు.