వికాస ఆధ్వర్యంలో నవంబర్ 1న జాబ్ మేళా

వికాస ఆధ్వర్యంలో నవంబర్ 1న జాబ్ మేళా

E.G: 'వికాస' ఆధ్వర్యంలో నవంబర్ 1న రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు వయసు ఉన్న అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.