VIDEO: 'జనసేన కార్యకర్తలకు అన్యాయం'
VSP: తూర్పు నియోజకవర్గ దేవాలయ కమిటీల నియామకాల్లో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకచెట్టు పోలమాంబ ఆలయ పాలకమండలిలో జనసేనకు ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆశించిన 30 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్నారు.