దొంగ ఓట్లతో గెలిచారు: తోపుదుర్తి

ATP: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గెలిచిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు, పోలింగ్ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.