ఎమ్మెల్యేని కలిసిన రజక కార్పొరేషన్ ఛైర్మన్
ATP: రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ లాయర్ సావిత్రి గారు ఇవాళ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని జేసీ స్వగృహంలో ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి అంశాలు, రజకుల అభివృద్ధిపై సంబంధించిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.