మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి బానోతు నరేష్
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 6వ వార్డుకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తరఫున బానోతు నరేష్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన పార్టీ బీ ఫారం బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిళ్ళ దయానంద రావు చేతుల మీదుగా మంగళవారం స్వీకరించారు. బీఎస్‌పీ జిల్లా ఇంఛార్జ్ జన్ను అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు బస్కే నాగరాజు పాల్గొన్నారు.