'జిల్లాలో 5,207 మంది పెన్షన్ దారులు'
SS: జిల్లాలో 5,207 మంది పెన్షన్ దారులు రీ-అసెస్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. వీరికి శుక్రవారం మడకశిర, కదిరి, ధర్మవరం, హిందూపురంలోని 4 ఆసుపత్రులలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గతంలో 40 శాతం కన్నా తక్కువ వైకల్య సర్టిఫికెట్స్ పొందినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరిగి సర్టిఫికెట్స్ పొందాలని కలెక్టర్ సూచిేంచారు.