'ఉచిత బస్సు పాస్ ఇలా నమోదు చేసుకోండి'
KRNL: దివ్యాంగ శక్తి పథకానికి ఎలా నమోదు చేసుకోవాలో కలెక్టర్ ఏ.సిరి గురువారం వివరించారు. RPWD చట్టం-2016 ప్రకారం 40% పైగా వైకల్యం ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. APSRTC బస్ పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలని ఆమె సూచించారు. 'మన మిత్ర' వాట్సాప్ బాట్ లేదా APSRTC మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ పాస్ పొందవచ్చని పేర్కొన్నారు.