చికిత్స పొందుతూ మాజీ ఎంపీపీ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మాజీ ఎంపీపీ అడపాల బాలచంద్ర ప్రతాప్(78)మంగళవారం ఉదయం చనిపోయారు. బాలచంద్ర ప్రతాప్ సోమవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ నగర్ నుంచి ఆటోలో వచ్చి వైఎస్ఆర్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి గూడూరు వెళ్తున్న ట్రక్ ఆటో వేగంగా ఢీకొంది. దీనితో తీవ్ర గాయాలై నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.