VIDEO: కాళోజీ సేవలు ప్రజలకు ఆదర్శనీయం: ఎంపీడీవో

ADB: ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు చేసిన సేవలు ప్రజలకు ఆదర్శనీయమని ఎంపీడీవో గంగాసింగ్ అన్నారు. ఇవాళ నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. అధికారులు కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. తెలంగాణ ఉద్యమానికి కాళోజీ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.