వరద నీటిలో మునిగిన ఆలయం

W.G: భారీ వర్షాలకు గోస్తాని నది పొంగి ప్రవహిస్తోంది. శనివారం పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరంలో రామేశ్వరస్వామి గర్భాలయంలోకి వరద నీరు చేరింది. ఆలయం చుట్టూ వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు జుత్తిగ, మాముడూరు, ఇలింద్రపర్రు గ్రామాల్లో రైతులు వేసుకున్న నారుమళ్లు సైతం నీట మునిగాయి.