శ్రీశైల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

NDL: శ్రీశైలంలో వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామివారి ఆలయానికి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపారాధన, నదిస్నానాలు చేసి వ్రతాలను చేశారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.