VIDEO: మేడారం జాతరకు ముందే షాపుల జోరు
MLG: తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులు భారీగా తరలివస్తూ.. అమ్మవార్లను దర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు సమీపంలోని రోడ్డు ఇరువైపులా వ్యాపారులు ముందస్తుగా షాపులు, షెడ్లు వేస్తూ సన్నాహాలు మొదలుపెట్టారు.